కేవలం భయం లేనంతమాత్రాన ధైర్యమున్నట్లు కాదు. తెలిసిన విషయాల హద్దులు దాటిన మరుక్షణం మీరు భయపడతారు. ఎందుకంటే, అప్పుడు ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో మీకు తెలియదు. ఆ భయమే మిమ్మల్ని తెలిసిన వాటినే పట్టుకుని వేలాడేలా చేస్తుంది. అయితే ఎన్ని భయాలున్నప్పటికీ మీకు తెలియని ప్రమాదకరమైన మార్గాలలోకి ప్రవేశించడమే ధైర్యమంటే.

ధైర్యమున్న వ్యక్తికి, పిరికివాడికి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. ఇద్దరికీ భయాలుంటాయి. కానీ, పిరికివాడు తన భయాలకు తగినట్లు ప్రవర్తిస్తాడు. ధైర్యమున్న వ్యక్తి తనకున్న భయాలన్నీ పక్కనపెట్టి, తనకు తెలియని వాటిలోకి కూడా దూసుకుపోతాడు.

తనకు తెలియని వాటి కోసం తనకు తెలిసిన వాటిని పణంగా పెట్టేందుకు సిద్ధపడుతూ, ఆ ప్రయత్నంలో తనకు ఏమవుతుందో కూడా ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం వెనుకాడకుండా పూర్తి బాధ్యతను స్వీకరించేందుకు అంగీకరించేవాడే అసలైన మగాడు, మొనగాడు. అదే అసలైన ధైర్యం. కేవలం సాహసవంతులు మాత్రమే ఆ పని చేస్తారు.

మీ భయమే మిమ్మల్ని బానిసగా చేస్తుంది. మీరు నిజంగా నిర్భయులైతే ఎవరికీ బానిస కాలేరు. నిజానికి, మీలోని భయమే ఇతరులు మిమ్మల్ని బానిసగా చేసుకోవడానికి ముందే మిమ్మల్ని వారికి బానిసగా చేస్తుంది. నిర్భయుడైన వ్యక్తి దేనికీ భయపడడు, తనను చూసి ఇతరులు భయపడేలా ప్రవర్తించడు. ఎందుకంటే, అతనికి ఎలాంటి భయాలు ఉండవు.

కేవలం ధైర్యం లేనందువల్ల మనం అనేక విషయాలను కోల్పోతున్నాం. నిజానికి, ఏదైనా సాధించడం కోసం గట్టి ప్రయత్నాలు చెయ్యవలసిన పని లేదు. కేవలం ధైర్యముంటే చాలు. అన్నీ మన దగ్గరికే వస్తాయి. కాబట్టి, మీరు మరింత ధైర్యస్థులవుతున్నకొద్దీ నిర్భయత్వం మీలో చోటు చేసుకుంటుంది. అదే అసలైన ధైర్యం.

మౌలికమైనది తెలుసుకోవాలంటే ఆలోచనారహిత స్థితిలో ఉండడమొక్కటే అసలైన మార్గం. విజ్ఞాన, వేదాంత, ధర్మశాస్ర్తాలన్నీ ఆలోచనకు సంబధించినవే. కానీ, ధార్మికత అనేది ఆలోచనకు సంబంధించినది కాదు. దాని విధానాలన్నీ అతి సన్నిహితంగా ఉంటాయి. అందుకే అది మీకున్న అడ్డంకులను తొలగించి, మిమ్మల్ని వాస్తవానికి మరింత చేరువ చేస్తుంది.

పూర్వనిశ్చితాభిప్రాయాలతో నిండిన కంటికి ఏదీ కనిపించదు. అలాగే ముగింపు అభిప్రాయాలతో నిండిన హృదయానికి ఏమాత్రం జీవముండదు. అనేక పూర్వనిశ్చితాభిప్రాయాల వల్ల మీ తెలివితేటల సౌందర్యం, సాంద్రత, పదును తగ్గిపోవడం ప్రారంభిస్తుంది. ఫలితంగా అవి చాలా నిస్తేజంగా తయారవుతాయి. వాటినే మీరు తెలివితేటలనుకుంటున్నారు.

నమ్మకాలన్నీ అరువు తెచ్చుకున్నవే. అవి మీకు ఇతరుల ద్వారా సంక్రమిస్తాయి. అంతేకానీ, అవి మీరు స్వయంగా సంపాదించుకున్న జ్ఞానం కాదు. ఇతరుల నుంచి అరువు తెచ్చుకున్న విషయాలు అసలైన వాస్తవాన్ని తెలుసుకునేందుకు మీకు ఎలా దారి చూపగలవు? కాబట్టి, వాటిని వెంటనే విడిచిపెట్టండి.

నిజానికి, మూర్ఖులు మాత్రమే సలహాలు ఇస్తారు, తీసుకుంటారు. జ్ఞానులు ఆ పని చెయ్యరు. ఎందుకంటే, ఉచితంగా ఇవ్వగలిగేవి కేవలం సలహాలు మాత్రమే అని, ఉచిత సలహాలను ఎవరూ పాటించరని జ్ఞానులకు తెలుసు. అందుకే వారు ఆ పని చెయ్యరు.

అహం అకారణంగా పుడుతుంది. అందుకే అది ఎప్పుడూ చాలా కృత్రిమంగా, నిరంకుశంగా, అవాస్తవంగా, నకీలీగా ఉంటుంది. అందుకే అది ఎప్పుడూ మృత్యుభయంతో ఉంటుంది. కాబట్టి, అహంతో ఉన్నప్పుడు మనం జీవాన్ని కోల్పోతాం, అహం లేనప్పుడు మనం జీవంతో ఉంటాం. కాబట్టి, అహం మరణించడం పునర్జన్మతో సమానం.

భయంతో ఎప్పుడూ పోరాడకండి. భయంతో పోరాడితే మీలో కొత్త భయం పుడుతుంది. అది పరోక్షంగా మీలో దాగి ఉన్న భయానికి తోడవుతుంది. అప్పుడు మీ భయం మరింత ఎక్కువై మీకు పిచ్చెక్కుతుంది. అలాంటి భయం చాలా ప్రమాదకరమైనది.

ప్రేమకు వ్యతిరేకమైనది ద్వేషం కాదు. ప్రేమకు వ్యతిరేకమైనది కేవలం భయం మాత్రమే. ప్రేమలో ఉన్నవారు పరిపూర్ణ విశ్వాసంతో చాలా విశాలంగా ఉంటారు. అందువల్ల వారి దగ్గర ఎలాంటి దాపరికాలు, ఒంటరితనాలు ఉండవు. కానీ, భయంలో ఉన్నవారు ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటారు. అందుకే వారు మూసుకుపోయి, ఏదీ పైకి చెప్పలేక ఒంటరిగా మిగిలిపోతారు.

మీరు ఎవరినైనా ద్వేషించాలంటే ముందు మీరు విషాన్ని మీలో పూర్తిగా నింపుకోవాలి. అప్పుడే మీరు ఎవరినైనా ద్వేషించగలరు. ఏదైనా మీ దగ్గర నిండుగా ఉన్నప్పుడే కదా, దానిని మీరు ఎవరికైనా ఇవ్వగలరు.

ప్రేమ చాలా సహజమైనది. అందుకే అది ఎప్పుడూ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే, అది ఎప్పుడూ అస్తిత్వంతో చాలా సామరస్యంగా ఉంటుంది. కానీ, ద్వేషం ఎప్పుడూ అలా ఉండదు. అందుకే అది ఎప్పుడూ రోగంతో చాలా అసహజంగా ఉంటుంది. కాబట్టి, ద్వేషం రోగానికి చిహ్నం, ప్రేమ ఆరోగ్యానికి చిహ్నం.

మీరు ఒంటరిగా ఉన్న మరుక్షణం మీ నకిలీ గుర్తింపు మాయమై, అణచివేయబడ్డ మీ వాస్తవం బయటపడడం ప్రారంభిస్తుంది. అందుకే మీరు ఒంటరిగా ఉండేందుకు చాలా భయపడతారు. ఎందుకంటే, ఎలాంటి ఆలంబన లేకుండా నకిలీ గుర్తింపు ఒంటరిగా ఉండలేదు.

తల్లిదండ్రులు, మతాచార్యులు, పూజారులు, రాజకీయ నాయకులు- ఇలా మీ అవాస్తవ వ్యక్తిత్వానికి కారకులైన వారందరూ ఎరుకతో కూడిన చైతన్యం ఏమాత్రం లేని అచేతనులే. వారి ఉద్దేశాలు మంచివే కావచ్చు. కానీ, అలాంటి అచేతనుల చేతుల్లో మంచి ఉద్దేశాలు కూడా విషతుల్యమవుతాయి.

ధ్యాన పద్ధతులన్నీ మీ అవాస్తవాన్ని నాశనం చేసేందుకు సహాయపడేవే కానీ, వాస్తవాన్ని ఇచ్చేవి కావు. అయినా దేని ద్వారానో లభించేది అవాస్తవమే అవుతుంది కానీ, వాస్తవం కాబోదు. నిజానికి, వాస్తవాన్ని ఎవరూ ఇవ్వలేరు. ఎందుకంటే, అది ఎవరో ఇచ్చే విషయం కాదు. నిజానికి, వాస్తవం మీ దగ్గరే ఉంది. అది బయట పడాలంటే మీ అవాస్తవాన్ని తొలగిస్తే సరిపోతుంది. ధ్యానం అందుకు చాలా చక్కగా సహాయపడుతుంది.

కేవలం ధైర్యం, సాహసం, తెగింపు ఉన్నవారు మాత్రమే ధార్మికులవుతారు. అంతేకానీ, చర్చిలకు, దేవాలయాలకు, మసీదులకు వెళ్ళే క్రైస్తవులు, హిందువులు, మహమ్మదీయులు ఏమాత్రం ధార్మికులు కారు, కాలేరు. ఎందుకంటే, వారందరూ తమ అవాస్తవ వ్యక్తిత్వాన్ని మరింత సంఘటితం చేసేందుకు ప్రయత్నిస్తూ, అన్వేషణను వ్యతిరేకించేవారే.

తూర్పు దేశాలలో ప్రపంచాన్ని పరిత్యజిస్తూ, ప్రేమరాహిత్యంతో జీవించే ప్రయత్నం జరిగింది. పాశ్చాత్య దేశాలలో ప్రేమకలాపాలే లోకమై అందరూ దారి తప్పి స్వలింగ, భిన్నలింగ, యాంత్రిక సంపర్కులుగా తయారై ధ్యానాన్ని విస్మరించారు. అలా ప్రేమ లేని ధ్యానంతో తూర్పు దేశాలు, ధ్యానం లేని ప్రేమతో పాశ్చాత్య దేశాలు పూర్తిగా ఓడిపోయాయి.

మీరు పుట్టిన వెంటనే మీలో కలిగే భయమే మీ దేవుడు. ఆ భయమే మరింత పెద్దదై మీరు మరణించే వరకు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి, భయం కలిగినప్పుడు దానిని ఎదుర్కోవాలే కానీ, దానిపై దేవుడి ముసుగు వేసినంత మాత్రాన ఆ భయం పోదు.

సత్యానిది ఎప్పుడూ బ్రహ్మచర్యమే. ఎందుకంటే, అది పెళ్ళి చేసుకోలేదు. అందుకే దానికి పిల్లలు లేరు. కానీ, అబద్ధం బ్రహ్మచారి కాదు. అందుకే అది అనేక అబద్ధాలను పుట్టిస్తుంది. ఎందుకంటే, దానికి కుటుంబ నియంత్రణపై నమ్మకం లేదు.

దేవుణ్ణి వదిలెయ్యండి. అది మిమ్మల్ని నిర్భయులుగా చేసేందుకు సహాయపడుతుంది. భయపడడం మానవసహజమనే వాస్తవాన్ని అంగీకరిస్తూ, దాని లోతుల్లోకి వెళ్ళి, దానిని అనుభవించండి. అంతేకానీ, దాని నుంచి తప్పించుకునే అవసరం లేదు.

మసీదులకు వెళ్ళే క్రైస్తవులు, హిందువులు, మహమ్మదీయులు ఏమాత్రం ధార్మికులు కారు, కాలేరు. ఎందుకంటే, వారందరూ తమ అవాస్తవ వ్యక్తిత్వాన్ని మరింత సంఘటితం చేసేందుకు ప్రయత్నిస్తూ, అన్వేషణను వ్యతిరేకించేవారే.

Shopping Cart Items

Empty cart

No products in the cart.

Return to Shop
Search for:
oshowonders.com